మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

యువరాణి పాట లిరిక్స్

1
యువరాణి పాట లిరిక్స్
సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

జోరుగా హుషారుగా

(Joruga Husharuga)

యువరాణి

(Yuvarani)

అర్మాన్ మాలిక్ ,నవ్య సమీర

(Armaan malik, Navya sameera)

రామజోగయ్య శాస్త్రి

(Ramajogayya Sastry)

ప్రణీత్

(Praneeth)

ఒక కలల నువ్వలా
నిజమయ్యవే నా బంగారు బొమ్మ
నిండుగా పండుగే
నీ కలయికతో పుర్తైనదే నా జన్మా..
నా ఊపిరి నువ్వమ్మా, ఆ ఆ

నీ కోపమంటే నాకు పొద్దు పొడుపులే
నీ నవ్వులంటే నాకు వెండి వెన్నెలే
నువ్వంటూ లేకపోతె నేను లేనులే
అంతలాగ నువ్వు నాలో
కలిసి మెలిసి పోయావే

నా సంగతేమో నాకు గుర్తు రాదులే
నీ ఊసులేవి నేను మర్చిపోనులే
నీపైన పెంచుకుంది ప్రేమ కాదులే
అంతకన్న ఎక్కువైన పిచ్చిలోన ఉన్నాను

యువరాణి యువరాణి నువ్వు
నా కలల యువరాణి నువ్వు
నీలాంటి అరుదైనా నిన్ను
వరమల్లె కలిసాను నేను

బతుకంత నీతోనే నేను
నువ్వు లేక కదలాడలేను
కలనైనా క్షణమైన నేను
నీ చెలిమి చేజార్చుకోను

కోటి కలల కేంద్రబిందువల్లే
నువ్వలాగ నిలిచి ఉంటే చాలు
కాలమంత ప్రేమ ఉత్సవాలే
నా గుండెలో..

ప్రాణవాయువల్లే వెంట కదిలే
జంటలాగ నువ్వు ఉంటె చాలే
జ్ఞాపకల పూల పరిమళాలే
నా దారిలో…

నీ రాకతో నాకంత ఆనందమే
ఏనాటికి నువ్వు నా సొంతమే

నువ్వంటే ఎందుకంటే అంత ఇష్టమో
మాటల్లో చెప్పమంటే ఎంత కష్టమో
నీ ప్రేమ పొందకుంటే ఎంత నష్టమో
తలుచుకుంటే ఉన్నపాటు
ఊపిరాగుతుందేమో

నీ చూపే బాషలేని ప్రేమ పత్రమో
నువ్వే నా ఊహల ప్రాణ చిత్రమో
మన గతాలు తెలిసి ఏ మాయజాలమో
మరో సారి నిన్ను నన్ను
ఇలా కలుపుతుందేమో

అడగొద్దు అడగొద్దు నన్నే
నువ్వంటే ఎంతిష్టమంటూ
వేవేల జన్మాలు అయినా
బ్రతికేస్తా నీ కలలు కంటూ

యువరాణి యువరాణి నువ్వు
నా కలల యువరాణి నువ్వు
నీలాంటి అరుదైనా నిన్ను
వరమల్లె కలిసాను నేను

బతుకంత నీతోనే నేను
నువ్వు లేక కదలాడ లేను
కలనైనా క్షణమైన నేను
నీ చెలిమి చేజార్చుకోను


Oka Kalala Nuvvalaa
Nijamayyaave Naa Bangaru Bomma
Ninduga Panduge
Nee Kalayikatho Poorthainadhe Naa Janmaa
Naa Oopiri Nuvvammaa, Aa Aa

Nee Kopamante Naaku Poddhu Podupule
Nee Navvulante Naaku Vendu Vennele
Nuvvantu Lekapothe Nenu Lenule
Anthalaaga Nuvvu Naalo
Kalisi Melisi Poyaave

Naa Sangathemo Naaku Gurthu Raadhule
Nee Oosulevi Nenu Marchiponule
Neepaina Penchukundhi Prema Kaadhule
Anthakanna Ekkuvaina Pichhilona Unnaanu

Yuvarani Yuvarani Nuvvu
Naa Kalala Yuvarani Nuvvu
Neelaanti Arudhaina Ninnu
Varamalle Kalisaanu Nenu

Bathukantha Neethone Nenu
NuvvuLeka Kadhalaadalenu
Kalanaina Kshanamaina Nenu
Nee Chelimi Chejaarchukonu

Koti Kalala Kendra Bindhuvalle
Nuvvulaaga Nilichi Unte Chaalu
Kaalamantha Prema Utshavaale
Naa Gundelo..

Praanavaayuvalle Venta Kadhile
Jantalaaga Nuvvu Unte Chaale
Gnapakaala Poola Parimalaale
Naa Daarilo..

Nee Raakatho Naakantha Aanandame
Yenaatiki Nuvvu Naa Sonthame..

Nuvvante Endukante Antha Ishtamo
Maatallo Cheppamante Entha Kashtamo
Neeprema Pondhakunte Entha Nashtamo
Thaluchukunte Unnapaatu
Oopiraaguthundhemo

Nee Choope Bashaleni Prema Pathramo
Nuvve Naa Oohala Praana Chitramo
Mana Gathaalu Telisi Ye Maayajaalamo
Marosaari Ninnu Nannu
Ilaa Kaluputhundhemo

Adagoddhu Adagoddhu Nanne
Nuvvante Enthishtamantu
Vevela Janmaalu Ayinaa
Brathikesthaa Nee Kalalu Kantu

Yuvarani Yuvarani Nuvvu
Naa Kalala Yuvarani Nuvvu
Neelaanti Arudhaina Ninnu
Varamalle Kalisaanu Nenu

Bathukantha Neethone Nenu
NuvvuLeka Kadhalaadalenu
Kalanaina Kshanamaina Nenu
Nee Chelimi Chejaarchukonu


We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)