మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

నువ్వో రాయి నేనో శిల్పి పాట లిరిక్స్

0
నువ్వో రాయి నేనో శిల్పి పాట లిరిక్స్
SaveSavedRemoved 1
సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

Charan Arjun
Charan Arjun
Charan Arjun


(హరి హరా, హా ఆ ఆ)
నువ్వో రాయి నేనో శిల్పి
చెక్కుతున్నంత సేపూ
నిన్ను నేనూ చెక్కుతున్నంత సేపూ
ఆ తరువాత అంటారంతా
నిన్ను దేవుడనీ
నేనో అంటరానివాడిని

నువ్వో రాయి… నేనో శిల్పి
చెక్కుతున్నంత సేపూ
నిన్ను నేనూ చెక్కుతున్నంత సేపూ
ఆ తరువాతా అంటారంతా
నిన్ను దేవుడనీ
నేనో అంటరానివాడిని

నీ గర్భగుడినే కట్టేటపుడు
నేను పెద్ద మేస్త్రి
అది పూర్తయ్యాక లోనకొస్తావుంటే
నన్ను బయటికి తోస్తివి..

నిన్ను మేలు కొలుపగ
డోలు సన్నాయి… నేనే వాయిస్తిని
కాని నిన్ను తాకే భాగ్యం లేదా
నేనేం పాపం చేస్తినీ..

(అయ్యో, దేవా)
నువ్వు నడిచేప్పుడు
నీ పాదాలు కందకుండా
చేసాను నీకు చెప్పులు
నా పాదాలనే నీ గుళ్లోన మోపనీవు
ఏంటయ్యా నా తప్పులు

సింగారించా నీకు బంగారు వస్త్రాలెన్నో
నేసాయి నా చేతులు
కానీ నిను చూడ రావాలంటే
నాకో జత బట్టల్లేవు
ఏంటయ్యా మా రాతలు

నీ మాసిన బట్టలే
మా ప్రసాదామని
నేను శుభ్రం చేస్తిని
కానీ మలిన పడిన వాడివంటూ
దూరంగా ఉండాలంటివి

నీ ముందు వెలిగే దీపంటలు
నా చెమటతో చేస్తినీ
కానీ ఎందుకో మా మట్టి బ్రతుకున
ఏ దీపం పెట్టవైతివి

(ఏ ఏ ఏ ఏ)
నోరే లేని మూగజీవాలను గాయమని
గోసీ ఓ గొంగడి ఇస్తివి
ఇప్పుడు వాటికి మాకు ఏ తేడాలే
లేవన్నట్లు సులకనగా వెనకబడేస్తివి

తల్లీ పాల వంటి… తాటి కల్లు గీసే
నా గోసలు చూడవైతివి
వందడుగుల చెట్టే ఎక్కే నా కాళ్ళకు
నిన్నే మోసే భాగ్యాన్నే ఇవ్వవైతివి

నీ పల్లకీ చేసిన చేతులకు
పాచిక పుల్లయిన ఇవ్వకపోతివి
ఊళ్ళో అందరికీ నేనే క్షవరాలు చేస్తే
నా బ్రతుకే క్షవరం చేస్తివి

మా పుట్టుక బట్టీ… చేసే పని బట్టీ
ఏవేవో పేర్లు పెడితివి
కానీ ఉన్నోడు లేనోడంటూ
తేడాలు చూపి నువ్ కూడా
మనిషై పోతివి..


(Hari Hara…)
Nuvvo Raayi Neno Shilpi
Chekkutunnantha Sepu
Ninnu Nenu Chekkuthunnantha Sepu
Aa Taruvatha Antaraantha
Ninnu Devudani
Neni Antaraanivaadini

Nuvvo Raayi Neno Shilpi
Chekkutunnantha Sepu
Ninnu Nenu Chekkuthunnantha Sepu
Aa Taruvatha Antaraantha
Ninnu Devudani
Neni Antaraanivaadini

Ninnu Melukolupaga
Dholu Sannaayi Nene Vaayisthini
Kaani Ninnu Thaake Bhagyam Ledha
Nenem Paapam Chesthini

(Ayyo Devaa)
Nuvvu Nadicheppudu
Nee Paadaalu Kandhakundaa
Chesaanu Neeku Cheppulu
Naa Paadaalane Nee Gullona Mopaneevu
Entayya Naa Thappulu

Singaarincha Neeku Bangaru Vasthraalenno
Neesaayi Naa Chethulu
Kaani Ninu Chooda Raavaalante
Naako Jatha Battallevu
Entayya Maa Raathalu

Nee Maasina Battale
Maa Prasaadamani
Nenu Shubhram Chesthini
Kaani Malina Padina Vaadinantu
Dhooranga Undaalantivi

Nee Mundhu Veligi Deepantalu
Naa Chematatho Chesthini
Kaani Enduko Maa Matti Brathukuna
Ye Deepam Pettavaithivi

Nore Leni Moogajeevaalanu Gaayamani
Gosi O Gongadi Isthivi
Ippudu Vaatiki Maaku Ye Thedaale
Levannatlu Sulakanagaa Venakabadesthivi

Thalli Paala Vanti Thaati Kallu Geese
Naa Gosalu Choodavithivi
Vandhadugula Chette Ekke Naa Kaallaku
Ninne Mose Bhaagyaanne Ivvavaithivi

Nee Pallaki Chesina Chethulaku
Paachika Pullaina Ivvakapothivi
Oollo Andariki Nene Kshavaraalu Chesthe
Naa Brathuke Kshavaram Chesthivi

Maa Puttaka Batti Chese Pani Batti
Evevo Perlu Pedithivi
Kaani Unnodu Lenodantu
Thedaalu Choopi Nuv Kooda
Manishai Pothivi..

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)