మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

పెనివిటి పాట లిరిక్స్

31

పెనివిటి పాట లిరిక్స్ (Peniviti Song Lyrics) ఈ పాట ఎంత బాగుందో పెనివిటి పాట అరవింద సమేత సినిమాలోని పాట. పడినవారు కాలబైరవ సంగీతం తమన్. పెనివిటి పాట తెలుగు మరియు ఇంగ్లీష్ బాషలో.

సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

అరవింద సమేత 

(Aravinda Sametha)

పెనివిటి

(Peniviti)

కలబైరవ

(KalaBairava)

రామ జోగయ్య శాస్త్రి 

(Ramajogayya Sastri)

తమన్

(Thaman)

 

 


నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను
నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను
ఒంటెద్దు బండెక్కి రారా..
సగిలేటి డొంకల్లో పదిలంగా రారా
నలిగేటి నా మనసు గురుతొచ్చి రారా
గలబోటి కూరొండి పిలిసీనా రారా
పెనిమీటీ ఎన్నినాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా
ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా

చిమ్మటి చీకటి కమ్మటి సంగటి
ఎర్రగా కుంపటి యెచ్చగా దుప్పటి
కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి

గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటీ – 2

చిమ్మటి చీకటి కమ్మటి సంగటి
ఎర్రగా కుంపటి యెచ్చగా దుప్పటి
కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి

గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటీ – 2

పొలిమేర దాటి పోయావని
పొలమారిపోయే నీ దానిని
కొడవలి లాంటి నిన్ను సంటివాడని
కొంగున దాసుకునే ఆలి మనసుని

సూసీ సూడక.. సులకన సేయకు..
నా తలరాతలో కలతలు రాయకు
తాళిబొట్టు తలసుకుని తరలి తరలి రార పెనిమిటీ
తాళిబొట్టు తలసుకుని తరలి తరలి రార పెనిమిటీ

నరగోస తాకే కామందువే
నరగోస తాకే కామందువే
నలపూసవై నా కంటికందవే
కటికి ఎండలలో కందిపోతివో
రగతపు సిందులతో తడిసిపోతివో

యేళకు తింటివో ఎట్టనువ్వుంటివో
యేట కత్తి తలగడై యేడ పండుకుంటివో
నువ్వుగన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటీ.
నువ్వుగన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటీ.

నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను
నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను
ఒంటెద్దు బండెక్కి రారా..
సగిలేటి డొంకల్లో పదిలంగా రారా
నలిగేటి నా మనసు గురుతొచ్చి రారా
గలబోటి కూరొండి పిలిసీనా రారా
పెనిమీటీ ఎన్నినాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా
ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా


Niddarani irisesei Reppalni therisaanu
Nuvvocche dhaarullo Choopulni parisaanu
Onteddu bandekki raara..
Sagileti donkallo padilanga raara
Naligeti naa manasu Guruthocchi raa raa
Galaboti koorondi Pilichina raa raa
Penimiti enni naallainadho
Ninu zoosi kallaaraa
Ennenni nallainadho
Ninu zoosi kallaaraa

Chimmati cheekati Kammati sangati
Erraga kumpati Ecchaga duppati
Kommallo sakkati Koyile okkati
Kommallo sakkati Koyile okkati
Gundene gonthu chesi Paadathandhi
raa raa penimiti
Gundene gonthu chesi Paaduthandhi
raa raa penimiti

Chimmati cheekati Kammati sangati
Erraga kumpati Ecchaga duppati
Kommallo sakkati Koyile okkati
Kommallo sakkati Koyile okkati
Gundene gonthu chesi Paadathandhi
raa raa penimiti
Gundene gonthu chesi Paaduthandhi
raa raa penimiti

Polimera dhaati poyavani
Polamaaripoye nee dhaanini
Kodavali laanti ninnu Santi vaadini
Konguna daasukune aali manasuni
Soosi soodaka sulakanu seyaku
Naa thala raathalo Kalathalu raayaku
Thaalibottu thalusukoni
Tharali tharali raa raa penimiti
Hey… thaalibottu thalusukoni
Tharali tharali raa raa penimiti

Naragosa thaake kaamanduve
Naragosa thaake kaamanduve
Nalapoosavainaa kantikandave
Katiki yendalalo kandipothivo
Ragathapu sindulato thadisipothivo
Yelaku thintivo ettanuvvuntivo
Yeta katti thalagadai Yeda pandukuntivo
Nuvvu ganna nalusunaina
Talasi talasi raara penimiti
Hey… nuvvu ganna nalusunaina
Talasi talasi raara penimiti

Niddarani irisesei Reppalni therisaanu
Nuvvocche dhaarullo Choopulni parisaanu
Onteddu bandekki raara…
Sagileti donkallo padilanga raara
Penimiti enni naallainadho
Ninu zoosi kallaaraa
Ennenni nallainadho
Ninu zoosi kallaaraa

అరవింద సమేత వీర రాఘవ (Aravindha Sametha Veera Raghava) సినిమా పాదాలను సెర్చ్ లో కొన్ని పదాలతో వెతికినారు అవి “Aravindha samerha” “Aravindasametha” . 

Aravindha Sametha Songs Lyrics

ఈ పాట కోసం రక రకాల పదాలతో వెతికారు వాటిలో కొన్ని పదాలు “Nedharani erichesi” “nidarani eriseti” “nidharni Eriseti”.

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా తెలుగు ప్రజలకోసం కేవలం సినిమా వార్తలు, అభిమాన హీరో మరియు హీరోయిన్ ఫోటోలు, ఆరోగ్య చిట్కాలు మరెన్నో కొత్త విషయాలు మొత్తం నేను తెలుగులో అందిస్తున్నాను.

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)