నేనె రాజు నేనె మంత్రి రివ్యూ – రాణా, కాజల్ అగర్వాల్

నేనె రాజు నేనె మంత్రి (Nene Raju Nene Mantri) సినిమా ఒక పొలిటికల్ కధ బేస్ చేసుకొని తీశారు.

జోగేంద్ర (రాణా) కాజల్ (రాధ) ఒకరు అంటే ఒకరికి అమితమైన ప్రేమ ఇద్దరు పెళ్లిచేసుకుంటారు. జోగేంద్ర విత్తనాలు ఎరువులు వ్యాపారం చేస్తు వడ్డీకి డబ్బులు ఇస్తుంటాడు చాలా మంచి మనిషిగా జనాల్లో పేరుంటుంది. శ్రావణ శుక్రవారం మొదటి దీపం గుడిదగ్గర రాధ వెలిగిస్తుంది అది చూసి ఓర్వలేని సర్పంచ్ భార్య రాధని నెట్టివేస్తుంది అప్పుడు రాధ కడుపు పోతుంది. రాధ కోసం జోగేంద్ర సర్పంచ్ కావాలని నిర్ణయించుకుంటాడు ఇలా ఆమె ఆనందం కోసం అడ్డం వచ్చినవారిని చంపుకుంటు పోతాడు చివరకు ముఖ్యమంత్రి అవ్వాలని నిర్ణయించుకుంటాడు ఈ క్రమంలో విలేకరి అయిన కతెరిన్ ట్రెస్స ను పడుచేస్తాడు. కాతెరిన్ ట్రెస్స వెంటనే రాణా కు లొంగిపోతుంది. రాణా తో కాతెరిన్ ట్రెస్స ప్రేమలో పడుతుంది. కానీ రాణా కాజల్ ని తప్ప ఎవ్వరిని ప్రేమించను అని ఒక సందర్భంలో తేల్చి చెప్తాడు. కాజల్ కోసం రాణా ముఖ్యమంత్రి పదవికి పోటీ వొదులుకుంటాడు కానీ శత్రువులు రాణా ని విడిచిపెట్టరు రాణా మీద బాంబ్ బ్లాస్ట్ చేస్తారు ఆక్రమంలో కాజల్ తీవ్రంగా గాయపడి ఫైనల్ స్టేజీలో హాస్పిటల్ లో చేరుస్తాడు రాణా తన కోసం ముఖ్యమంత్రి పదవికి పోటీ వదులుకున్నాడని గ్రహించి ఆమెకు ఉంచిన మెడికల్ ఆ వస్తువులు తొలగించుకొని చని పోతుంది. చనిపోయిన తన భార్యను వూరుమొత్తం తిప్పి సానుభూతి పొంది రాణా గెలుస్తాడు. కానీ చివరకు తన పార్టీలో చేరింది ప్రతార్థులని తెలుసుకొని మొత్తం తన పార్టీ తరపున గెలిచిన సభ్యులను బాంబ్ పెట్టి చంపేస్తాడు. చివరకు తనకు తాను శిక్ష వేసుకుంటారు రాధ లేజాపోతే జోగేంద్ర లేడు అని తనకు తాను ఉరి వేసుకుంటాడు. ఇది నేనె రాజు నేనె మంత్రి సినిమా కధ.

#NeneRajuNeneMantriReview #NrNmReview #Telugu #Rana #KajalAgarwal #Catheri Tressa

Watch Nene Raju Nene Mantri Trailer

7.5 Total Score
ప్రేమకోసం అన్ని త్యాగం - పొలిటికల్ మూవీ

రాజకీయానికి సంబందించిన కధకు ప్రేమను జోడించి నేనే రాజు నేనే మంత్రి సినిమా తీసారు.

PROS
  • 1.రాణా, నవదీప్, కాజల్ అగర్వాల్ నటన.
  • 2.దర్సకత్వం.
  • 3.విబిన్నమైన కధ.
CONS
  • 1.జనాలు గొర్రెలు అని చూపడం.
  • 2.క్లైమాక్స్ పట్టు కోల్పోవడం.
  • 3.దర్శకుడి ఓల్డ్ టీం.
Add your review

Comments

comments

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా తెలుగు ప్రజలకోసం కేవలం సినిమా వార్తలు, అభిమాన హీరో మరియు హీరోయిన్ ఫోటోలు, ఆరోగ్య చిట్కాలు మరెన్నో కొత్త విషయాలు మొత్తం నేను తెలుగులో అందిస్తున్నాను.

Register New Account
Reset Password

Send this to a friend